దైవ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
On
విశ్వంభర, తలకొండపల్లి: దైవ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం తలకొండపల్లి మండలం అంతారం గ్రామ పంచాయతీలో ఆయన నివాసంలో నూతనంగా నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయానికి 1,00,000 రూపాయల చెక్కును అందించారు. కార్యక్రమంలో ఆమనగల్, తలకొండపల్లి మండల అధ్యక్షులు డోకురు ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ ఛైర్మన్ గుర్రం కేశవులు, దేవాలయ కమిటీ సభ్యులు,తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



