ఛత్రపతి శివాజీకి గీతం ఘన నివాళి
395వ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని స్మరించుకున్న ఉన్నతాధికారులు
విశ్వంభర, సంగారెడ్డి : ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో బుధవారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు శివాజీ అజేయ స్ఫూర్తిని, దార్శనిక నాయకత్వాన్ని, భారత చరిత్రకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ వీ.ఆర్.శాస్త్రి, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ జి.శివకుమార్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ఆర్.బందన్ కుమార్ మిశ్రా, క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అధ్యాపక సభ్యులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి, శివాజీ మహారాజ్ శాశ్వత వారసత్వాన్ని, ఆయన నిలబెట్టిన విలువలను ప్రతిబింబిస్తూ, ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు.



