ఘనంగా మాస్టర్ మైండ్స్ స్కూల్స్ లో వార్షికోత్సవ వేడుకలు
On
విశ్వంభర, హైదరాబాద్ : హయత్ నగర్ లో ఉన్న ది మాస్టర్ మైండ్స్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలను ప్రిన్సిపాల్ కోట్ల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజు సంగాని, స్కూల్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.ప్రిన్సిపాల్ కోట్ల సంధ్యారాణి పిల్లలకు మెడల్స్,సర్టిఫికెట్స్ అందచేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.తమ పిల్లలకు స్కూల్ లో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రిన్సిపాల్ కోట్ల సంధ్యారాణికి పిల్లల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియచేశారు.