చిట్యాల ఉచిత మెగా హెల్త్ క్యాంపునకు అపూర్వ స్పందన
- సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. బొడ్డు బాబురావు
- కామినేని హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య పరీక్షలు
విశ్వంభర, చిట్యాల : సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి అధ్యక్షులు డాక్టర్ బొడ్డు బాబురావు ఆధ్వర్యంలో చిట్యాల లోని జెడ్పి హెచ్ఎస్ లో ఉచిత మెగా హెల్త్ క్యాంపు ను నిర్వహించారు. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వారి సౌజన్యంతో కామినేని పిఆర్ ఓ బద్దుల యాదగిరి సమక్షంలో హాస్పిటల్స్ డాక్టర్ల బృందం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పట్టణ పరిధి నుండి దాదాపు 300 మంది వైద్య పరీక్షలకు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్య సమస్యలను డాక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి సలహాలను అందజేశారు. ఈ క్యాంపులో ఆరోగ్య పరీక్షలు బీపీ, షుగర్ , రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఈసీజీ , కంటి వైద్య, దంత పరీక్షలు నిర్వహించారు. సమాచార హక్కు ప్రజా చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. బొడ్డు బాబురావు మాట్లాడుతూ సమాచార హక్కు వికాస ప్రజా చైతన్య సమితి ద్వారా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ సమితి ద్వారా విద్యార్థులకు అవగాహన సదస్సులు , నోట్ పుస్తకాల పంపిణి , వృద్దులకు దుప్పట్లు , పండ్ల పంపిణి కార్యక్రమాలు ఎన్నో చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా సమితి ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. కొండ వెంకట లక్ష్మి , పిల్లి ధనలక్ష్మి , విపూరి సుదర్శన్ , జిట్ట నర్సింహా రాజు , జిల్లాల గోవర్ధన్ రెడ్డి, పందుల పాండరి , గాదె మల్లేష్ సమితి సభ్యులు , డాక్టర్లు, ల్యాబ్ అసిస్టెంట్స్ , వారితో పాటు స్థానిక నాయకులు , ప్రజా ప్రతినిధులు , ప్రజలు పాల్గొన్నారు.



