ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన.

ఉచిత వైద్య శిబిరానికి అపూర్వ స్పందన.

విశ్వంభర, భూదాన్ పోచంపల్లి : తెలంగాణ  పద్మశాలి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి లో వీవెర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ , పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ సంయుక్త సహకారంతో యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పద్మశాలి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ నేతృత్వంలో నిర్వహించిన వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. ఈ శిబిరంలో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు,కుటుంబ సభ్యులు పాల్గొని శిబిరంలో వివిధ ఆరోగ్య సమస్యల కొరకు డాక్టర్స్ అందుబాటులో ఉండి బిపి, రక్త పరీక్షలు , మధుమేహం , ఎముకల సాంద్రత పరీక్ష, ఊపిరితిత్తుల పరీక్ష, దంత పరీక్ష, ఎక్స్ రే, ఈసీజీ , మహిళా వైద్య పరీక్షలు , సాధారణ వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్బంగా గుంటక రూప సదాశివ్ మాట్లాడుతూ చేనేత వృత్తి పై ఆధారపడి జీవిస్తున్న చేనేత కార్మికులు నలభై , యాభై సంవత్సారాల వయసులోనే కంటి చూపు సమస్య, ఎముకుల సమస్య , మహిళల కు సంబందించిన ఆరోగ్య సమస్యల తో బాధ పడుతున్నారని, మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ద్వారా దాదాపు ఐదు వందల మంది వరకు ఉచిత వైద్యం, పరీక్షలు, మందులు అందించడం జరిగిందని తెలిపారు.  మహిళా విభాగం రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు చేపడుతామని అన్నారు.  పోచంపల్లి టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు భారత లవ కుమార్ మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసమే కాకుండా , పోచంపల్లి ప్రజల కొరకు ప్రతి సంవత్సరం స్వచ్ఛంద సేవా కార్యక్రామాలు, వైద్య శిబిరాలు , రక్తదానం వంటి సేవలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వీవెర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ బర్రెంకల మధుసూదన్ , అఖిల భారత పద్మశాలి జనరల్ సెక్రటరీ గడ్డం జగన్నాథం , తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గుర్రం శ్రవణ్ కుమార్,  జనరల్ సెక్రటరీ మాచర్ల రామ్ చందర్ రావు , హరికిషన్, తడక రమేష్, మాధురి, శశికళ , పోరండ్ల శారద, సప్నరాజ్ చిన్నకోట్ల , నోముల రేఖ స్వరూప , అరుణ శ్రీ , శోభ, శాంతి , అరుణ, కర్నాటి బాలరాజు, గంజి బాలరాజు, ముస్కురు నర్సింహా , భానుమతి, శశికళ , గుర్రం హేమలత , కర్నాటి అంజమ్మ, రామనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. aSDAwda
 
 
 
 

Tags: