శ్రీశ్రీ శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అమవాస్య అన్నప్రసాద వితరణ
విశ్వంభర , కొత్తపేట : అమావాస్య సందర్బంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడురి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో శ్రీశ్రీ శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, ఈ డబ్ల్యు ఎస్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తాడిశెట్టి పశుపతి, సంఘం ప్రధాన సలహాదారులు, అశోక బోర్ వెల్స్ అధినేత మంచుకొండ సురేందర్ గుప్త, చీకటిమల్ల అశోక్ కుమార్, ఎల్వి కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రతి అమావాస్య రోజున క్రమం తప్పకుండ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని.. పేదల ఆకలి తీర్చితే ఆ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు. సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాసు గుప్తా మాట్లాడుతూ.. సంఘం సభ్యులు, దాతల సహాయ సహాకారాలతో ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. చైతన్యపురిలో మా సంఘం సభ్యుడి ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలిపోతే వారికీ సంఘం తరపున ఆర్థిక సహకారం అందజేశామని.. నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహకారం అందజేశామని అన్నారు. ఈ సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకతున్న విద్యార్థులకు వసతులు కల్పించెందుకు కృషి చేస్తామని శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రాధాన కార్యదర్శి అత్తెమ్ సత్తయ్య గుప్త, కోశాధికారి తాళ్లపల్లి ప్రభాకర్ గుప్త, అన్న ప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణికుంట శ్రీనివాస్ గుప్త, కో కన్వినర్ అర్వపల్లి శ్రీనివాస్ గుప్త, ఈసీ సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.



