మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు రజాక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి 134 వ జయంతి కార్యక్రమం మహబూబాబాద్ మండల ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్షులు నిర్వహించారు . ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మహమ్మద్ రజాక్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఒక్కరు ముందుకు కొనసాగించాలని , తన భావజాలాన్ని పంచేవారే అని , నిజమైన వారసులని, తెగకుండా అంబేద్కర్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక కుల, మతాలకు అందరికీ సమన్యాయం జరగాలని మంచి ఉద్దేశంతోనే భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని భారతదేశంలో ప్రతి ఒక్కరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటేనే భారతదేశ మనుగడ కొనసాగుతుందని ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తూ భిన్నత్వంలో ఏకత్వం అని అన్ని కులాల మతాలవారు కలిసి ఉండే గొప్ప దేశం భారతదేశం అని ఇలాంటి అద్భుతమైన దేశ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ 134 వ వారి కి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూన్నామని వారు అన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు దర్శనం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



