ఖమ్మం జిల్లా టి.జె.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి
విశ్వంభర, ఖమ్మం :-భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా టి.జె.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది. అలాగే ఎన్టీఆర్ సర్కిల్ లోని హోటల్ రసపాక పక్కన నూర్ రెసిడెన్సీలో తెలంగాణ జన సమితి పార్టీ కార్యవర్గ సమావేశం షేక్ సర్దార్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఇంచార్జ్ గోపగాని శంకర్రావు హాజరైనారు, ఈ సమావేశంలో పార్టీ నిర్మాణం గ్రామ కమిటీలు మండల కమిటీలు గురించి చర్చించుకోవడం జరిగింది, పార్టీ కార్యాలయం ఏర్పాటు సుబ్లేడు మండల సాధన కోసం తీర్మానం అలాగే య మ్ వెంకటాయపాలెం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని, కారేపల్లి మండలం రొట్టమాకు రేవు ఉరి వాగు మీద రైతులు పొలాలకు వెళ్ళుటకు బ్రిడ్జి ని మంజూరు చేయాలనీ,అలాగే అర్హులను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, రేషన్ కార్డులు అవకతవకలు జరిగాయని ప్రభుత్వం స్పందించి రేషన్ కార్డుల పై దృష్టి సారించి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలో భాగంగా ఇచ్చినటువంటి ఉద్యమకారులకు 250 గజాల స్థలం తో పాటు పెన్షన్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేయడం జరిగింది, అలాగే పార్టీ బలోపేతం కోసం మే నెలలో చేరికలు ఉంటాయని ఆ చేరికలకు శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం గారు హాజరవుతారని అందుకు టీజేఎస్ పార్టీని బలపరిచి స్థానిక సంస్థల్లో బలం నిరూపించుకోవాలని పార్టీ ముఖ్య నాయకులను కోరడం జరిగింది, అలాగే ప్రకృతి ప్రేమికుడు దరిపల్లి వనజీవి రామయ్య మరియు కమ్యూనిస్టు నాయకుడు ఎర్ర శ్రీకాంత్ మరియు మైనార్టీ నాయకులు అబ్జల్ గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించటం జరిగింది, ఈ కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర నాయకులు ప్రముఖ డాక్టర్ సయ్యద్ అజీమ్, జిల్లా ప్రదాన కార్యదర్శి బట్టు రాజేందర్ నాయక్, టౌన్ ప్రదాన కార్యదర్శి మహబూబ్ పాషా, ఖమ్మం రూరల్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు భాను ప్రసాద్, వైరా నియోజకవర్గ నాయకులు ఎస్కే అక్బర్ , తిరుమలయపాలెం మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కామేపల్లి మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



