అంబెడ్కర్ జయంతి చేయని ఉద్యోగులను సస్పెండ్ చేయాలి
విశ్వంభర, మల్లాపూర్ :- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో సుమారు 14 గ్రామాలలో పంచాయితీ కార్యదర్శులు దళిత సంఘ నాయకులతో కలుపుకొని అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు ఉన్న బేకాతారు చేశారని దళిత సంఘ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్బంగా దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ....తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన వాటిని బేకాతరు చేస్తూ జయంతి ఉత్సవాలను నిర్వహించలేదని ఆరోపించారు. మండలంలో సుమారు 14 గ్రామాలలో కార్యదర్శులు కార్యక్రమాలు నిర్వహించలేదని సమాచారం ఉందన్నారు. మండల అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఎందుకు వివక్షత, దళితులు అంటే ఎందుకు చిన్న చూపు అని మండిపడ్డారు.దళిత ఆర్గనైజేషన్లను కలుపుకొని కార్యక్రమాలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అన్నారు. కాబట్టి 14 గ్రామాలలో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించని కార్యదర్శిలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సస్పెండ్ చేయని యెడల ఆందోళనలు,నిరసనలు చేపడుతామని మండల పరిషత్ అధికారికి వినతి పత్రం అందజేశారు.