అంబేద్కర్ జయంతి సందర్బంగా కొవ్వత్తులతో ఘన నివాళులు
విశ్వంభర, కేసముద్రం : కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని భారతీయ జనత పార్టీ జాతీయ , రాష్ట్ర శాఖల ఆదేశాలమేరకు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పునుతల రమేష్ అధ్యక్షతన, మండల కన్వినర్ పూర్నకంటి భాస్కర్ , బెజ్జం సురేష్ ల ఆద్వర్యంలో ఆదివారం రాత్రి కేసముద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పరిసరాలను శుబ్రపరిచి , విగ్రహానికి జలాభిషేకం చేసి కొవ్వత్తులు వెలిగించి నివాళులు అర్పిచారు. అనంతరం జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు న్యాయవాది తుంపిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప న్యాయ కోవిదుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బోగోజు నాగేశ్వర చారి, భువనగిరి ఉపేందర్ కొండ్రెడ్డి, వీరారెడ్డి, సింగంశెట్టి మధు, బొల్లోజు వీరన్న, చక్రధర్ ,రవీందర్ రెడ్డి, రోజ్జోజు, వీరభద్ర చారి, బొద్దుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.



