బస్ భవన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
On
విశ్వంభర, హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బస్ భవన్ లో సోమవారం ఆ మహనీయుని చిత్రపటానికి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ముని శేఖర్, వెంకన్న, జాయింట్ డైరెక్టర్ నర్మద, సీపీఎం ఉషాదేవి, సీటీఎంలు శ్రీదేవి, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.



