ఘనంగా అంబేద్కర్ 134 వ జయంతి -కిసాన్ పరివార్ సీఈవో వివేక్
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని కోర్టు ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కిసాన్ పరివార సంస్థ, మరియు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కిసాన్ పరివా ర్ సంస్థ సీఈవో డాక్టర్ వివేక్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు గుగ్గిల పీరియలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా చెప్పదగిన వ్యక్తి ,చాలా మేధావి అని అంబేద్కర్ని మనమందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గొప్ప మేధావి అని అన్నారు . అంతే కాకుండా అంబేద్కర్ రాంజీ సక్వాల్, ల కి తేదీ 14 .4. 1891 వ సంవత్సరంలో జన్మనిచ్చారని వారు అన్నారు . మరియు 1915 సంవత్సరంలో అంబేద్కర్ ఎంఏ డిగ్రీ పూర్తి చేసారని, ఆయన రోజుకి 18 గంటలు చదువులోనే నిమగ్నమై ఉండేవాడని గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో కిసాన్ పరివార్ సంస్థ కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు .



