హనుమకొండ లో అంబేద్కర్ 134వ జయంతి 

హనుమకొండ లో అంబేద్కర్ 134వ జయంతి 

విశ్వంభర, హనుమకొండ జిల్లా :  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా హనుమకొండ అంబేద్కర్ సెంటర్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహానికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వరంగల్ ఎంపీ కడియం కావ్య,  ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి పూలమాలవేసి నివాళులర్పించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే  కేఆర్ నాగరాజు .  అనంతరం హనుమకొండ డిసిసి భవన్ నందు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్రపటానికి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు, కష్టపడ్డ ప్రతి వ్యక్తికి పేరుపేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాలకి డా బి ఆర్ అంబేద్కర్  ఆశా కిరణం అని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, హజ్ కమిటీ చైర్మన్ ఖుషర్ పాషా, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, కమిషనర్ అశ్విని తానాజీ, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, కమ్మగొని ప్రభాకర్ గౌడ్, పత్రి భాను ప్రసాద్, యాదగిరి, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, డివిజన్ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: