నా భూమి నాకు ఇప్పించండి అక్రమంగా నా భూమిని ఆక్రమించారు -రిటైర్డ్ ఆర్మీ జవాన్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ని చందనవెళ్లి గ్రామ రెవెన్యూ పరిధిలో గల సర్వేనెంబర్ 19/300/4 లో గల ఐదు ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్ ఆర్మీకి చెందిన రెడ్డయ్య అనే వ్యక్తికి 2005లో కేటాయించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చందన వెళ్లి హైతాబాద్ భూములను ప్రవేట్ పరం చేయడంతో అందులో భాగంగానే రెడ్డయ్య రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి యొక్క భూమిని కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఆయనకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. అందుకుగాను ఆయన తన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన పొలంలో జెసిబి తో చదును చేస్తున్న సందర్భంలో అతను వెళ్లి వారిని అడ్డుకోగా వాళ్ళు వెళ్లిపోయినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను రిటైర్ అయిన తర్వాత తనకు ప్రభుత్వం రిటైర్మెంట్ తర్వాత 5 ఎకరాల భూమిని కేటాయించిందని, అది చందనవెళ్లి రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వేనెంబర్ 190 /300/4 నెంబర్లు 5 ఎకరాలను కేటాయించినట్లు తనకు ఎమ్మార్వో ఆర్డర్ కాపీని కూడా చూపించాడు. కానీ ఇప్పుడు టిజి ఐఐసి వాళ్ళు వచ్చి ఈ భూమి కంపెనీ కొన్నదని చెప్పి తనను రానివ్వడం లేదని ఆయన మీడియాతో వాపోయారు. దయచేసి నా భూమి నాకు ఇప్పించగలరని లేదా దానికి రావలసిన నష్టపరిహాన్ని అయినా చెల్లించవలసిందిగా ఆయన తెలంగాణా ముఖమంత్రి రేవంత్ రెడ్డిని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ఆయన కోరారు. లేనిపక్షంలో నేను నా కుటుంబ సభ్యులు ఈ భూమిలోని ఆత్మహత్య చేసుకుని చనిపోతామని తెలిపాడు. నేనొక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ని నాకు ఎలాంటి భూమి లేదు. దీనిని నమ్ముకుని ఉన్నాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చందనవెల్లిలో భూములు లేకుండా వారి ఖాతాలో డబ్బులు ఎలా పడ్డాయని ఆయన అన్నారు అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐసీసీ కేటాయించిన సమయంలో భూములు లేని వారు కూడా భూమి రాసి నష్టపరిహారం వాళ్లకు చెల్లించారని భూమి ఉన్న వారికి మాత్రం మొండి చేయి చూపించారని ఆయన వాపోయారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగిన నష్టపరిహారం వస్తుందని చెప్పడమే తప్ప ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందలేదని తన కుటుంబం ఎలా కొనసాగాలో తనకు అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి తన భూమికి రావలసిన నష్టపరిహారాన్ని తనకు అందించాలని లేదా తన భూమి తనకు ఇప్పించాలని ఆయన రాష్ట్ర నాయకులను కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తనకు న్యాయం జరిగేలా చూస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



