బండ్లగూడ తహసిల్దార్ ఆలయాల సందర్శన
On
విశ్వంభర, గౌలిపుర :ఆషాడ మాస బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గౌలిపుర శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత దేవాలయం మరియు కోట మైసమ్మ దేవాలయంను బండ్లగూడ ఎమ్మార్వో కే ప్రవీణ్ కుమార్ మరియు డిప్యూటీ ఎమ్మార్వో తో పాటు మండల సభ్యులు పాల్గొని పూజలు అందుకున్నారు. దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎ ర్మని కైలాస గంగపుత్ర శాలువాతో సన్మానించి, డిప్యూటీ ఎమ్మార్వో గారికి అమ్మవారి చీర సమర్పించారు. మండల కార్యవర్గ సభ్యులకు సన్మానించిన దేవాలయ కమిటీ సభ్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు వర్కింగ్ ప్రెసిడెంట్ కే ఎస్ ఆనందరావు, ముఖ్య సలహాదారులు ఎస్ మల్లేశం గౌడ్, కే జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్ పాశం సురేందర్, ప్రధాన కార్యదర్శి అల్లి మధుసూదన్ గిరి, ఉపాధ్యక్షులు బి వై శ్రీకాంత్, ఎం ప్రకాష్,పి ప్రకాష్ అశోక్ గౌడ్,రాము గౌడ్,ఎం రమేష్ గౌడ్, మహేందర్ తదితర సభ్యులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



