క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

విశ్వంభర, కల్వకుర్తి: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 34వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లా జట్టు ద్వితీయ స్థానంలో నిలవడం జిల్లాకే గర్వకారణం అన్నారు. ఓటమితో కుంగిపోకుండ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. చదువు తో పాటు క్రీడలలో రానిస్తే ఉజ్వల భవిష్యత్ ఉందని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు దుస్తులను అందించిన ధ్యాప నిఖిల్ రెడ్డి ని ప్రతేంకంగా అభినందించారు. క్రీడాకారులు సాధన చేసేందుకు మ్యాట్ లు ఏర్పాటుకు కృషి చేస్తానని, ట్రాక్ సూట్లు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్, ఉపాధ్యక్షులు మ్యాకల శ్రీనివాసులు, ఆర్గనైసింగ్ సెక్రెటరీ రమేష్ అసోసియేషన్ సభ్యులు మోహన్, డాక్యనాయక్, కోచ్ గణేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags: