ఘనంగా 2500 ఫీట్ల జాతీయ జెండా ర్యాలీ - ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి 

ఘనంగా 2500 ఫీట్ల జాతీయ జెండా ర్యాలీ - ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి 

విశ్వంభర, ఎల్బీనగర్ : వనస్థలిపురం డివిజన్ పరిధిలోని లోటస్ లాప్ స్కూల్ దగ్గర లయన్స్ క్లబ్ వారు ఎర్పాటు చేసిన 2500 ఫీట్ల జాతీయజెండా ర్యాలీ కార్యక్రమంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ జెండా దేశ సార్వభౌమాధికారాన్ని,గౌరవాన్ని,మరియు సమష్టి ఐక్యతను సూచిస్తుంది. భారీ జెండాలు ఈ భావనలను మరింత ప్రభావవంతంగా తెలియజేస్తాయి. భారీ జాతీయ జెండాలను ఎగురవేయడం ద్వారా దేశభక్తిని పెంపొందించవచ్చు. మరియు ప్రజలలో ఐక్యతా భావనను కలిగించవచ్చు అని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గరపు దయనంద్ గుప్తా, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గోని శ్రీధర్ గౌడ్, ఉద్యమకారులు దూసరి మధు గౌడ్, సంజయ్, ముద్దగోని సతీశ్ గౌడ్ మరియు వనస్థలిపురం లయన్స్ క్లబ్ అధ్యక్షులు నందకిషోర్,దూరయ్య,రవీందర్ రెడ్డి,నర్సింహులు,సువిధ,నీరజ్,భాస్కర్ మరియు పలువురు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Tags: