అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 134వ జయంతి ఉత్సవాలు
విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు కట్ట గాలిబ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీ నాయకులు ప్రజా సంఘాలు యువజన సంఘాలు వివిధ కులల నాయకులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆలోచనలు వారి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తి పొందాలన్నారు.బడుగు బలహీన వర్గాల జాతులు దళితులు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించాలంటే విద్యా ద్వారానే సాధ్యమని ఉన్నత విద్యావంతులై సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ పార్టీ నాయకులు జక్కలి ఐలయ్య యాదవ్, దోనూరి వీరారెడ్డి, ఉప్పల లింగస్వామి, సుర్వి యాదయ్య, దుబ్బాక భాస్కర్, చిలువేరు అంజయ్య, శివరాత్రి విద్యాసాగర్, తెలంగాణ బిక్షం, సుర్వి రాజు గౌడ్,దొడ యాదిరెడ్డి, శ్రీనివాసచారి, సంఘం నాయకులు మహేశ్వరం కృష్ణయ్య, బల్లెం రామస్వామి, మందుగుల బాలకృష్ణ, కట్ట లింగయ్య, గుండమల్ల మల్లేష్, మహేశ్వరం స్వామి, కట్ట గాలయ్య, కృష్ణ,గుండమల్ల నరేష్, రమేష్, లింగస్వామి, సాయిలు, సత్యనారాయణ, యాదయ్య, శంకరయ్య, సోమేశ్వర్, నరసింహ, కట్ట నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.



