గ్లోబల్ నావిగేటర్స్ ఓవర్ సీస్ ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు

  గ్లోబల్ నావిగేటర్స్ ఓవర్ సీస్ ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు

  • మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజ్ శేఖర్ రెడ్డి  ప్రోత్సహంతో  ఉచిత వైద్య సేవలు 

విశ్వంభర, మౌలాలి : గ్లోబల్ నావిగేటర్స్ ఓవర్ సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులూ మారెడ్డి రాజ్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజ్ శేఖర్ రెడ్డి  ప్రోత్సహంతో   ఆదివారం నాడు మౌలాలి లోని, షఫీ నగర్ లో శ్రీనివాస్ హోమ్స్ లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. వనజ మల్టీ స్పెషలాటి హాస్పిటల్ సౌజన్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల ఆరోగ్య సమస్యలను డాక్టర్లు  క్షుణ్ణంగా పరిశీలించి సలహాలను అందజేశారు. ఈ క్యాంపులో ఆరోగ్య పరీక్షలు బీపీ, షుగర్ , రక్త, మూత్ర పరీక్షలతో పాటు ఈసీజీ , కంటి వైద్య, దంత  పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు, ల్యాబ్ అసిస్టెంట్స్ ,  వారితో పాటు స్థానిక నాయకులు , ప్రజా ప్రతినిధులు , ప్రజలు పాల్గొన్నారు.

Tags: