సౌదీ అరేబియా లో భువనేశ్వరి గ్రూప్ టెంపుల్ టౌన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం
On
విశ్వంభర, సౌదీ అరేబియా : సౌదీ అరేబియా లో భువనేశ్వరి గ్రూప్ టెంపుల్ టౌన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం ఘనంగా చేపట్టారు. భారతీయ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్న అక్కడ భువనేశ్వరి గ్రూప్ ఉండాలి అదే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) రియాద్ లో జరుపుకునే తెలుగు భాషా దినోత్సవం 2024 సంతోషకరమైన సందర్భంగా, సాటా టీమ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, మన ప్రియమైన తెలుగు భాష యొక్క అద్వితీయమైన రుచులకు ఒక అందమైన జ్ఞాపికగాఉండనివ్వాలని అన్నారు. మీ అందరికీ మన భాషా మరియు సాంస్కృతిక వైవిధ్యంలో ఆనందం, ఐక్యత మరియు గర్వంతో నిండిన రోజు కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమములను భువనేశ్వరి గ్రూప్ వారి సమర్పణ లో నిర్వహించారు.