సుప్రీంకోర్టు తీర్పుకు మందకృష్ణ మాదిగకి ఎలాంటి సంబంధం లేదు - డా. పిడమర్తి రవి
విశ్వంభర, కరీంనగర్ : జిల్లా షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణ పై సదస్సుకు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన డా. పిడమర్తి రవి పాల్గొని మాట్లాడారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో విడివిడిగా కార్యక్రమాలు పెట్టాలి. జిల్లా రాష్ట్రవ్యాప్తంగా 30 సంవత్సరాలుగా చాలా సందర్భాలలో సభలు సమావేశాలు పెట్టుకుంటున్నాము ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మన మాదిగలు ఉద్యమానికి సహకరించాలి 30 ఏళ్లుగా ప్రారంభమైన ఈ యొక్క మాదిగ ఉద్యమం ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. SC - ABCD కి సంబంధించి సుప్రీం కేవలం తీర్పు మాత్రమే ఇచ్చింది చట్టం తేవాలి, చట్టానికి కావాల్సిన చట్టం చేసి ఆర్డినెస్ తేవాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మాదిగ ఉద్యమంలో ధర్మముంది కాబట్టే సుప్రీంకోర్టు న్యాయం చేయగలిగింది తప్ప వర్గీకరణకు నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదు. సుప్రీంకోర్టు ప్రకారం చట్టం చేస్తే ఈ రాష్ట్రంలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు కొనియాడారు. నేను పిడమర్తి రవిగా మళ్లీ మళ్లీ చెప్తున్నా సుప్రీంకోర్టు తీర్పుకు మందకృష్ణ మాదిగకి ఎలాంటి సంబంధం లేదు. మనం న్యాయం వైపు ఉన్నాం కాబట్టి సుప్రీంకోర్టు మనకు తీర్పు న్యాయం చేసింది తప్ప దీనికి మందకృష్ణకి ఏలాంటి సంబంధం లేదు. మందకృష్ణ మాటలను మాదిగల నమ్మే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు అని వారు అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని సంఘాలు అందరం కలిసి మాదిగలకు 12% రిజర్వేషన్ అమలు చేయాలని మేము పోరాటం చేస్తున్నాము అని అన్నారు. 12% కొరకు కొట్లాడిన కూడా ఈ తెలంగాణలో మాదిగల న్యాయం జరగడం లేదని వారు మాట్లాడారు. ఈ వేదిక నుంచి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో మాదిగల జనాభా ఎక్కువ శాతం ఉన్నది అక్కడ వారు ఎంత శాతం ఉన్నారో వారికి అంత రిజర్వేషన్ అక్కడ ఇవ్వాలని వారు ఈ ప్రభుత్వాన్ని కోరారు. ఒక పాలమూరు జిల్లాకే 14% శతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా సంఖ్య 80% శాతం అయితే,, 20%శాతం ఉన్న అగ్రవర్ణాలకు 6%శాతం రిజర్వేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో 80 శాతం ఉన్న మాదిగలకు ఎందుకు 12% రిజర్వేషన్ ఇవ్వరని మేము అడుగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే జిల్లాల వారీగా రిజర్వేషన్ అమలు చేస్తున్నారో అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మాదిగల యొక్క రిజర్వేషన్ జిల్లాల వారీగా పంచాలని పిడమర్తి రవి ప్రభుత్వాన్ని కోరారు