శ్రమ ఎవరిది సంపద ఎవరిది తేల్చడమే టి ఎఫ్ టి యు  కర్తవ్యం - కార్మిక వర్గం ఒక శక్తిగా మారాలి - డా .కాచం సత్యనారాయణ 

     వేలాది కార్మికులతో పెబ్బేర్ పట్టణంలో భారీ ప్రదర్శన - వనపర్తి జిల్లా టిఎఫ్టియు రెండవ మహాసభలు విజయవంతం.

 శ్రమ ఎవరిది సంపద ఎవరిది తేల్చడమే టి ఎఫ్ టి యు  కర్తవ్యం - కార్మిక వర్గం ఒక శక్తిగా మారాలి - డా .కాచం సత్యనారాయణ 

విశ్వంభర, వనపర్తి : టిఎఫ్ టియు వనపర్తి జిల్లా రెండవ మహాసభలు పెబ్బేర్ పట్టణంలో ఘనంగా జరిగాయి. సభల ప్రారంభానికి ముందు 2000 మంది కార్మికులతో పెబ్బేరు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమైన ఊరేగింపు  పురవీధుల నుండి  కొనసాగుతూ కొల్లాపూర్ రోడ్డు లోని అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకున్నది. అక్కడ అంబేద్కర్ కు నివాళులర్పిస్తూ వనపర్తి చౌరస్తాకు చేరుకొన్నది. అక్కడ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ నుండి సహారా ఫంక్షన్ హాల్ చేరుకొని భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభలకు తెలంగాణ వీఆర్ఏ సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ కార్యదర్శి ఎన్. గోవిందు అధ్యక్షత వహించారు. సభలో ముఖ్య వక్తలుగా  టి ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖలీల్ గారు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ వి శ్రీనివాస్ గౌడ్ గారు, టి ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యాక్షులు బి.గంగన్న, ఉమ్మడి జిల్లా అధ్యక్షులుపి. విజయ కుమార్ పాల్గొని ప్రసంగించారు. కాచం సత్యనారాయణ మాట్లాడుతూ కార్మికులు రాజకీయ పార్టీలకు తోకలుగా మారకుండా కార్మిక వర్గం ఒక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. టి ఎఫ్ టి యు తెలంగాణ ఉద్యమంలో పురుడు
 పోసుకున్నదన్నారు. టి ఎఫ్ టి యు ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదన్నారు. పుష్కరకాలంగా అనేక కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించామని, విజయాలు అపజయాలు చవిచూసామన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉన్న విఆర్ఏ సంఘాన్ని తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు చేయడంలో టిఎఫ్టియు పాత్ర కీలకమైందన్నారు. అంచలంచలుగా వారి వేతనాలు పెంచుకుని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ అయ్యారన్నారు. స్కూల్ స్వీపర్ల సమస్యలు పరిష్కరించడంలో రాజి లేని పోరాటం చేస్తున్నామన్నారు . ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళని రెగ్యులరైజ్ చేసి తీరుతామన్నారు. టి ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ మాట్లాడుతూ దోపిడీ, పీడన, విద్వేషాలు లేని సమాజం యుద్ధాలు లేని ప్రపంచం కార్మిక వర్గం  లక్ష్యమై ఉండాలన్నారు. శ్రామిక మహిళలను పాలకుల నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వ్యవసాయ కూలీలకు అసంఘటిత రంగ కార్మిక మహిళలకు మెటర్నటీ బెనిఫిట్ 50,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలలు ప్రపంచానికి వ్యవసాయాన్ని, పశుపోషణ నేర్పారన్నారు. కొండలను పిండి చేసే శ్రామికులు బండ చాకిరీ చేస్తున్నారన్నారు. ఏ శ్రమ చేయని పెట్టుబడిదారులు సకల భోగాలు అనుభవిస్తున్నారనన్నారు. శ్రమకు సంపదకు మధ్య ఉన్న సంబంధాన్ని  తేల్చడమే టీ ఎఫ్ టి యు కర్తవ్యం అన్నారు. సభకు అధ్యక్షత వహించిన గోవిందు గారు మాట్లాడుతూ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన చట్టాలను కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మార్చిందన్నారు. చట్టాలన్నీ బహుళ జాతి కంపెనీలకు, సామ్రాజ్యవాదులుకు అనుకూలంగా మార్చిందన్నారు. కార్మిక శాఖ నిర్వీర్యం చేయబడ్డదని, పెట్టుబడిదారుల ఇష్టా రాజ్యాం కొనసాగుతుందని తెలిపారు.  బి. గంగన్న మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 70% కి పైగా ఇతర రాష్ట్రాల కార్మికులు ఆక్రమించుకున్నారన్నారు. అంతర్ రాష్ట్ర వలస కార్మిక చట్టాన్ని అమలు చేసి స్థానికులకు 80% శాతం ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పి. విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో పనిచేసే స్కూల్ స్వీపర్లకు నెలకు 5,200 వేతనం ఇవ్వడం  సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాలే కనీస వేతనాలు అమలు చేయకపోతే ప్రైవేట్ పెట్టుబడిదారులు ఎక్కడ అమలు చేస్తారని ప్రశ్నించారు. కనీస వేతనాల కొరకు మెరుగైన జీవితాల కొరకు టి ఎఫ్ టి యు సమరశీల పోరాటాలకు సిద్ధపడుతుందని హెచ్చరించారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు స్థానిక ఎమ్మెల్యే  మేఘారెడ్డి  ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడుతుందన్నారు. అనంతరం అరుణోదయ సాహితీ సాంస్కృతిక సమాఖ్య నాయకులు, మన్సూర్, రాకేష్, స్ఫూర్తి కళాబృందం విప్లవ పాటలతో అలరించారు. విప్లవ కవి చెరబండ రాజు రాసిన కొండలు పగులేసినం బండలను పిండినమనే పాటతో పేదల పరిస్థితిని, దోపిడిని సామాన్యులకు అ ర్తమయ్యే భాషలో వివరించారు. టి ఎఫ్ టి యు నూతన జిల్లా కమిటీ ఆమోదంతో సభలు ముగిశాయి. ఈ సభలలో జి గట్టన్న,స్కూల్ స్వీపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, బల్ రాం ఎరుకలి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హమాలి సంఘం నాయకులు ఎల్లన్న జయన్న శ్రీను వెంకటేశ్ కురుమన్న, స్వీపర్ల సంఘం నాయకులు వెంకటేష్, చండ్రాయుడు, జయమ్మ, రిక్షా కార్మిక సంఘం నాయకులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి హామీ వ్యవసాయ కూలీ తదితర రంగాల కార్మిక నాయకులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-07-03 at 4.13.28 PM (2)WhatsApp Image 2025-07-03 at 4.13.28 PM (1)WhatsApp Image 2025-07-03 at 4.13.27 PMWhatsApp Image 2025-07-03 at 4.13.27 PM (1)

 

Tags: