మదర్ ల్యాంపులో మానసిక వికలాంగులకు అన్నదానం
On
విశ్వంభర, బిఎన్ రెడ్డి నగర్ : మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మదర్ ల్యాంపులో మానసిక వికలాంగులకు అన్నదానం కార్యక్రమం సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆహారం అందక ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారనీ, అలాగే చాలా ఫంక్షన్ లో లెక్కలు లేనంత అన్నం వృధా కూడా అవుతుంది. కావున మనకున్న సమయంలో సేవా మార్గంలో నడిచి వృద్ధులను, అనాధలను, మానసిక వికలాంగులకు పేదవారిని, బీదవారిని ఆదుకోవలసిన సామాజిక బాధ్యత ఎంతో ఎంత ఉందని బర్త్ డేలు పుట్టినరోజులు ఇలాంటి పుణ్యస్థలంలో జరుపుకోవాలని అన్నారు. దాతలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్నాటి స్వామి గౌడ్, కర్నాటి కావ్య హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగిత, మదర్ లాంప్ ఇంచార్జ్ మమత, సందీప్, మానసిక వికలాంగులు పాల్గొన్నారు.



