బంగారు తెలంగాణ అంటే ఇదేనా ?

 బంగారు తెలంగాణ అంటే ఇదేనా ?

విశ్వంభర, హైదరాబాద్: పదకొండు  సంవత్సరాలు గడిచింది
తెలంగాణ రాష్ట్ర కలసాకారం పూర్తయ్యి...............
అయినా ఆశించిన రీతిలో ముందుకు సాగుతుందా ?
అభివృద్ధి పథంలో ప్రగతి సాధిస్తుందా ?
పాలకుల మాటలకు చేతలకు పొంతన ఉన్నదా ?
రాష్ట్రం లోని అన్ని సామాజిక వర్గాల వారికి సమన్యాయం లభించిందా ?
పేదరికం అనేది పెరిగిందా ? తగ్గిందా ?
రాష్ట్రం లో సంపద సృష్టి జరిగిందా ?
వర్గ పోరాటాలకు చరమ గీతం పాడిందా ?
పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో 
పయనించిందా ?
నిరుద్యోగుల భాధలు తీరాయా ?
రాష్ట్రంలో మధ్య తరగతి ప్రజానీకానికి  విద్యా వైద్యం న్యాయం ఉచితంగా అందుతున్నాయా ?
పేదవారికి ఉచిత గృహ నిర్మాణ పరిమళం కల నెరవేరిందా ?
రాష్ట్రం లో ఏ సామాజిక వర్గాల వారు సుఖమయ జీవితం గడుపుతున్నారు !!
ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్ఠం 
చేయడంలో వెనుకంజకు కారణాలు 
ఏమై ఉండవచ్చు !!
కార్పొరేట్ వ్యవస్థకు రెడ్ కార్పెట్ 
వేసి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది వాస్తవం కాదా ?
ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల లు అంటూ టెండర్లు వేసిన మాట వాస్తవం కాదా ?
దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటీ ?
నానాటికీ విద్యావ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యం చేస్తున్నారు 
అన్నపు రాశులు ఒకచోట
ఆకలి మంటలు ఒకచోట
హంస తూలికలు ఒకచోట
అలసిన దేహాలు ఒకచోట
రాష్ట్ర జీవన వైచిత్రిని చక్కగా వివరించారు మహాకవి కాళోజీ నారాయణరావు గారు 
రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను
తెలంగాణ రాష్ట్రం ఎన్నో ఆశలతో ఏర్పాటు అయ్యింది
60 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ
రాష్ట్ర ఆవిర్భావానికి అంకురార్పణ చేసింది 
ఎంతో మంది ప్రాణ త్యాగం చేసిన ఫలితం ఈ తెలంగాణ
తెలంగాణ సాధన కోసం కృషి చేసిన
ఎంతో మంది ఆవిర్భావం చూడకుండానే
కన్ను మూశారు 
తెలంగాణ ఉద్యమాన్ని దేశ దృష్టిని ఆకర్షించడానికి నాడు తన మంత్రి పదవి
తృణ ప్రాయంగా వదిలి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం చెందే వరకు మరల
పదవిని చేపట్టనని ప్రతిన భూనిన 
దీశాలి పద్మశాలి ముద్దుబిడ్డ
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు
ఇలాంటి త్యాగ ధనుల ఫలితమే
నేడు అనుభవిస్తున్న తెలంగాణ
ఇలా సాకారం అయినా తెలంగాణ
సర్వ జనుల శ్రేయస్సు కోసం పరిపాలన
చేయండి 
స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ
ఎత్తుగడల కోసం పదవీ కాంక్షల కోసం
కుటుంబ యోగ క్షేమాల కోసం
ప్రాకులాడ వద్దని కోరుతూ ఉన్నాను 
ప్రజల సొమ్ము అన్యాయంగా దారాదత్తం
చేసుకుంటే అది తర తరాలుగా వినాశనాన్ని కోరుతుంది
కావున చదువుకున్న యువతకు ఉద్యోగ
అవకాశాలు విస్తృతం చేయండి
మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 
ఉచిత పథకాలకు చరమ గీతం పాడండి
విద్య _ వైద్యం _ న్యాయం
ఈ మూడు కూడా పేద ప్రజానీకానికి
ఉచితంగా అందించండి
ప్రజా ప్రతినిదులు నిస్వార్థం తో
పని చేస్తే ఇవన్ని కూడా సాధ్యం అవుతుంది నాయొక్క భావన
రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నదని మీరే చెబుతున్నారు
కావున బంగారు తెలంగాణ సాకారం కావాలంటే..........
దుబారా ఖర్చులు తగ్గించండి
విందులకు వినోదాలకు ఆడంబరాలకు దూరంగా ఉండండి
నిస్వార్థంగా అభివృద్ధికి కృషి చేయండి
గత ప్రభుత్వ తప్పిదాల దృష్ట్యా ప్రజానీకం మార్పు కోరుకున్నారు
వారి ఆశలను ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి..............
ఇక రాబోయే కాలంలో బి సీ వాదానికి పెరుగుతున్న ఆదరణను
గౌరవించండి
కుల గణన ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సన్నాహాలు 
చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను 
_
రాపోలు వీర మోహన్
                          B . Com 
  అధ్యక్షులు
  తెలంగాణ చేనేత ఐక్య వేదిక 
  హైదరాబాద్
  9866477255
  29 జూన్ 2025 ఆదివారం

Tags: