చండూరు మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్  - MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

 సర్వతోముఖాభివృద్ధికి యాక్షన్ ప్లాన్ -  జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా చండూరు మున్సిపాలిటీ ని అభివృద్ధి చేసుకోవాలి  

 చండూరు మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్  - MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

విశ్వంభర, మునుగోడు : చండూరు మున్సిపాలిటీని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుకుంటూ  అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు  మునుగోడు శాసనసభ్యులు  కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి . మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో  చండూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో చండూరు మాస్టర్ ప్లాన్ పై  పవర్ పాయింట్  ప్రజెంటేషన్ ఇచ్చారు.  హైదరాబాదుకు చెందిన   సీనియర్ మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ సుభాని.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా  భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, మురుగునీటి శుద్ధి కేంద్ర  ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, కూడళ్ళ నిర్మాణం, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్,  నూతన మున్సిపాలిటీ పరిపాలన భవనం, పార్కులు, షాపింగ్ కాంప్లెక్స్ లు  నిర్మాణాలపై యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. చండూరు రెవిన్యూ డివిజన్ గా మారిన తర్వాత భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని వారికి సరిపడా మౌలిక వసతులను కల్పించాలని నిర్ణయించారు. ప్రధానంగా డ్రైనేజ్ సిస్టంపై లోతుగా అధ్యయనం చేసి దానికనుగుణంగా మాస్టర్ ప్లాన్  రెడీ చేశారు. ఈ యాక్షన్ ప్లాన్ ను రానున్న మూడు ఆర్థిక సంవత్సరాలలో  విడతల వారీగా అభివృద్ధి చేసుకోవాలని, ఈ అభివృద్ధికి సంబంధించిన నిధులను ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశం లో హైదరాబాద్ కు చెందిన మాస్టర్ ప్లాన్ సీనియర్ కన్సల్టెంట్  సుభాని, ఉమ్మడి నల్గొండ జిల్లా పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వరరావు, డి ఈ మనోరమ, ఏఈ నాగ ప్రసాద్, విద్యుత్ ఏఈ గణేష్, చండూరు పట్టణ కాంగ్రెస్ ముఖ్య నాయకులు అనంత చంద్రశేఖర్ , దోటి వెంకటేష్ , మంచుకొండ సంజయ్ , గజ్జల కృష్ణారెడ్డి, , నల్లగంటి మల్లేశం, అయితరాజు మల్లేష్ , కల్లేట్ల మారయ్య  పాల్గొన్నారు.WhatsApp Image 2025-06-28 at 2.51.13 PM
 
 

Tags: