గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సుకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
On
విశ్వంభర, హైదరాబాద్ ; గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాస్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో జులై 13న హైదరాబాద్ గాంధీభవన్ లోని ప్రకాశం హాల్లో నిర్వహిస్తున్న గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు మరియు మహాత్మా చరక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి లకు ఆహ్వాన పత్రిక గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి, సెక్రటరీ యానాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులులతో కలిసి ఆహ్వానించడం జరిగింది. వీరి వెంట తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి, రైతు కమిషన్ మెంబర్ కె. వి.ఎన్. రెడ్డి, భూమి సునీల్ పాల్గొన్నారు. గాంధీజీ సూచించిన సుస్థిరాభివృద్ది లక్ష్యాలను విద్యార్థి దశ నుండే రానున్న తరాలకు అందించాలని, వివిధ కార్యక్రమాల నిర్వహిస్తున్నట్లు , గాంధీ సంస్థలు గత కొన్ని సంవత్సరాలుగా విస్తృతస్థాయిలో గాంధీ తత్వంలో ప్రబోధించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామనీ, ఈ కార్యక్రమంలో సుస్థిర విద్య, వైద్యం ,వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, పర్యావరణం, సహజ ఇంధన వనరులు , మత్తు పదార్థాల నిషేధం పై ప్రదర్శనలు మరియు ప్రముఖులచే సందేశాలు ఉంటాయని యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.



