అగ్నిప్రమాద ఘటనపై హెచ్ ఆర్సీ లో ఫిర్యాదు   - జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి

 అగ్నిప్రమాద ఘటనపై హెచ్ ఆర్సీ లో ఫిర్యాదు   - జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు , న్యాయవాది దుండ్ర కుమారస్వామి

విశ్వంభర, సంగారెడ్డి జిల్లా :  పటాన్‌చెరు, పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం 9:18 గంటలకు సంభవించిన భారీ పేలుడు ఒక కన్నీటి ఘట్టానికి వేదికైంది. ఈ ఘోర విపత్తులో 20 మంది కార్మికులు సజీవ దహనమై కన్నుమూశారు, 34 మంది తీవ్రంగా గాయపడ్డారు, వీరిలో 25 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ పేలుడు ధాటికి మూడంతస్తుల భవనం కుప్పకూలి, నరమాంసాలతో నిండిపోయింది. వంద మీటర్ల ఎత్తుకు ఎగిసిన మంటలు, రెండు కిలోమీటర్ల దూరంలో వినిపించిన విధ్వంసక శబ్దం వందల కుటుంబాలను కన్నీటిలో ముంచెత్తాయి.మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ తయారీకి ఉపయోగించే రసాయనాల వల్ల రియాక్టర్ లేదా ఎయిర్ డ్రయ్యర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కంపెనీ యాజమాన్యం బాధితులకు అండగా ఉండాల్సిన సమయంలో పరారీలో ఉండటం బాధాకరం. ఈ నిర్లక్ష్యం కేవలం అలసత్వం కాదు, కార్మికుల జీవించే హక్కును కాలరాయడమే అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు,  దుండ్ర కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించడం అభినందనీయం. అన్నారు. ఈ ఘటనకు కారణమైన నిర్లక్ష్యం చూపిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి, డిస్మిస్ చేయాలి. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వెంటనే చెల్లించాలి. గాయపడిన కార్మికులకు ఉచితంగా అత్యుత్తమ వైద్య సహాయం అందించాలి. నిర్లక్ష్యానికి కారణమైన కంపెనీ యాజమాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన 24 గంటల్లో అరెస్ట్ చేయాలి.ఈ ఘటనపై సమగ్రమైన దర్యాప్తు కోసం స్వతంత్ర కమిటీని నియమించాలి. ఈ ఘోరం కార్మికుల జీవన హక్కును హరించడమే కాక, రసాయన పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ దళ్ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో బాబా యాదవ్ వేణు యాదవ్, ప్రముఖ ఐటీ ని ప్రోడక్ట్ కేశవరెడ్డి, వెంకటేష్ మధు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Read More మొదటి రెండు గంటల్లో 9.2% పోలింగ్ నమోదు

 

 

 

Tags: