నేటి పరీక్షకు "ఇనుగుర్తి గురుకులం"రెడి..

10గం.కే విద్యార్థులు సెంటర్ కు రావాలి.. ప్రిన్సిపాల్ జయశ్రీ

నేటి పరీక్షకు


                                

విశ్వంభర,ఇనుగుర్తి: గురుకుల విద్యాలయాలలో 2025-26 సం.5,6,7,8,9 తరగతుల ప్రవేశాల కోసం విద్యార్థులకు నేడు(ఆదివారం) జరగనున్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కు మండల కేంద్రం ఇనుగుర్తిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం ఏర్పాట్లు పూర్తి చేసుకుని రెడీగా ఉంది. పరీక్షకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జయ శ్రీ మాట్లాడుతూ..పరీక్షకు హాజరయ్యే స్టూడెంట్స్ ఉదయం 10 గం.వరకే సెంటర్ కు రావాలన్నారు. అభ్యర్థులు ఇన్విజిలేటర్ల సహకారంతో ఓఎంఆర్ సమాధాన పత్రానికి చెందిన షీట్స్ తమ వివరాలు నింపడం కోసం ముందస్తుగా హాజరు కావాలన్నారు.11 గం.దాటిన అనంతరం అనుమతించేది లేదన్నారు. పరీక్షార్థులు హాల్ టికెట్స్,బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్, ప్యాడ్స్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

Tags: