తెలంగాణకు తీపి కబురు.. మూడు రోజులపాటు భారీ వర్షలు!

తెలంగాణకు తీపి కబురు.. మూడు రోజులపాటు భారీ వర్షలు!

తెలంగాణ వ్యాప్తంగా నేడు పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక రేపు ఎల్లుండి కూడా కొన్ని ప్రాంతాలలో తేలికపాటితో పాటు మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు

ఎండలు బాగా మండిపోతున్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురును తెలియజేశారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున గాలులతో కూడిన వర్షాలు పడటంతో వాతావరణం కాస్త చల్లబడింది అయితే మరో మూడు రోజుల పాటు తెలంగాణ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది.

 

Read More కామధేను బెస్ట్ ఫాదర్ అవార్డు అందుకున్న డా. మనోజ్ కు పుట్టి హరికుమార్ ప్రశంసలు

తెలంగాణ వ్యాప్తంగా నేడు పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక రేపు ఎల్లుండి కూడా కొన్ని ప్రాంతాలలో తేలికపాటితో పాటు మరికొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని అధికారులు వెల్లడించారు.

 

Read More కామధేను బెస్ట్ ఫాదర్ అవార్డు అందుకున్న డా. మనోజ్ కు పుట్టి హరికుమార్ ప్రశంసలు

 రేపు గంటకు 30-40 కి. మీ., వేగంతో, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 – 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక మే నెలలో ఎక్కువగా వడగాలులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కానీ ఈసారి మాత్రం వాతావరణంలో మార్పుల కారణంగా నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే ముందుగానే రాబోతున్నాయని దీంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.