కెసిఆర్ తోనే తెలంగాణ కల సాకారం: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.

కెసిఆర్ తోనే తెలంగాణ కల సాకారం: ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ.

విశ్వంభర, ఎల్బీనగర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుదీర్ఘ స్వప్నం కేసీఆర్ తోనే సాధ్యమైందని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్కే పురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని చింత చెట్ల వద్ద డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి, మిఠాయిలు పంచుకొని, శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా అరవింద శర్మ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం కెసిఆర్ 14 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని అన్నారు. దేశంలోని దాదాపు 36 రాజకీయ పార్టీలతో తెలంగాణ కు జై కొట్టించిన ఘనత కెసిఆర్  కే దక్కుతుందన్నారు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కెసిఆర్ పదేళ్ల పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, సాజిద్, వెంకటేష్ గౌడ్, కంచర్ల శేఖర్, పెంబర్తి శ్రీనివాస్, మహమ్మద్ జాహిద్, శ్యామ్ గుప్తా, ముచ్చింతల జగన్,శ్రీమన్నారాయణ, రమేష్ కురుమ,మహేందర్ రెడ్డి, డివిజన్ మహిళా అధ్యక్షురాలు లిక్కీ ఊర్మిళా రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునీత రెడ్డి, మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: