కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 

శ్రావణ శుక్రవారం ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు

కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 

IMG-20250809-WA0022 విశ్వంభర, వరంగల్:- శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతాన్ని పూనుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీ మహాలక్ష్మి దేవస్థానం అర్చకుడు అన్న వజ్జల భరత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వరలక్ష్మి దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వరంగల్ హోల్సేల్ ట్రేడర్స్ కమర్షియల్ కాంప్లెక్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ లోని ప్రధమంగా నిర్మించిన శ్రీ వరలక్ష్మీ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పూలు, పండ్లు చీర సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు మాట్లాడుతూ వరంగల్లో మొట్టమొదటిసారి నిర్మించిన ఏకైక వరలక్ష్మీ దేవాలయం ఇక్కడ నెలకొల్పబడిందని  ముఖ్యంగా స్త్రీలకు పురుషులకు లోక కళ్యాణం జరిగే అష్టలక్ష్మి అమ్మవారు అని అంటారు.  శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే రోజుని వరలక్ష్మీ శుక్రవారం అంటారు. స్రీలు ఏదైతే వరలక్ష్మీ వ్రతాన్ని పూనుకుంటారో వారికి సుఖ సంపదలు, సౌభాగ్యములు, పుత్ర పౌత్ర వర్ధిల్లాలని అమ్మవారిని పూజిస్తారని తెలిపారు. పది సంవత్సరాల నుండి ఇక్కడ నెలకొల్పబడిన అమ్మవారు భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుస్తుందన్నారు. ఇటువంటి దేవాలయము ప్రతిష్టించబడిందని అన్నారు. ఇది ప్రత్యేకమైన మహాలక్ష్మి అమ్మవారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కలశాల పూజలు, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ అర్చకుడు తెలిపారు. భక్తులు కోరుకున్న కోరికలు అమ్మవారి ఆశీర్వాదాలతో  ఎంతోమంది అమ్మవారిని దర్శించుకున్నారని ఈ సందర్భంగా అర్చకుడు అన్న వజ్జల భరత్ కుమార్ పేర్కొన్నారు.

Tags: