వరల్డ్ కప్ సూపర్-8.. ఆసీస్‌పై ఆఫ్ఘాన్ ఘన విజయం

వరల్డ్ కప్ సూపర్-8.. ఆసీస్‌పై ఆఫ్ఘాన్ ఘన విజయం

  • గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆఫ్ఘాన్
  • సూపర్ 8లో ఆసీస్‌పై 21పరుగుల తేడాతో గెలుపు

సూపర్-8లో మరో సంచలన రికార్డు నమోదైంది. గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన ఆఫ్ఘానిస్థాన్ సూపర్-8లో ఆస్ట్రేలియాతో తలపడి 21పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60), ఇబ్రహీం జద్రాన్ (51) హాఫ్ సెంచరీలు సాధించారు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ (3/28) టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు.

అఫ్గాన్ బౌలర్ల ధాటికి ఆసీస్ వెనుకబడిపోయింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (59) రాణించినా మిగతా వారు విఫలమయ్యారు. దీంతో ఆసీస్ 127 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ నైబ్ (4/20) అద్భుత బౌలింగ్‌తో అఫ్గాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నవీనుల్ హక్ (3/20), నబీ (1/1), రషీద్ ఖాన్ (1/23), ఒమర్జాయ్ (1/10)తో మంచి ప్రదర్శనకనబరిచారు. దీంతో గ్రూప్-1లో భారత్ రెండు విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకోగా ఆసీస్, ఆఫ్గాన్ ఒక్కో గెలుపుతో రేసులో ఉన్నాయి.

Related Posts