యూఎస్ పై గెలుపు.. సూపర్-8 కి భారత్

యూఎస్ పై గెలుపు.. సూపర్-8 కి భారత్

 

Tటీ20 ప్రపంచ కప్‌ 2024లో భారత్ అదరగొడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలచిన టీమ్ ఇండియా.. వరుసగా మూడో మ్యాచ్ లో కూడా విజయం సాధించింది. బుధవారం నాడు అమెరికాతో న్యూ యార్క్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగులు చేసింది. నితీశ్‌కుమార్‌ (27) టాప్ స్కోరర్.

Read More క్రీడలతో ఆరోగ్యం : ఎంపీడీవో

ఇక 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు ఆదిలోనే పరాభవం ఎదురైంది. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ (3), విరాట్ కోహ్లీ (0) మరోసారి ఘోరంగా నిరాశ పరిచారు. ఇక రిషభ్ పంత్ కూడా కేవలం 18 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దాంతో సూర్యకుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 50 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో ఆదుకున్నాడు. 

దాంతో ఇండయా 111 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక శివం దూబే కూడా ( 35 బంతుల్లో 31 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకు ముందు అమెరికాను నాలుగు వికెట్లు తీసి కట్టడి చేసిన పేసర్ అర్షదీప్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.