మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో సింధు ఓటమి!

మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో సింధు ఓటమి!

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మలేసియా మాస్టర్స్ ఫైనల్‌ మ్యాచ్‌లో చుక్కెదురైంది. చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది.

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మలేసియా మాస్టర్స్ ఫైనల్‌ మ్యాచ్‌లో చుక్కెదురైంది. చైనా క్రీడాకారిణి వాంగ్ జీయీ చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. మొదటి గేమ్‌లో ఆధిపత్యం కనబరిచిన సింధు.. ఆ తర్వాత రెండు, మూడు గేమ్‌లలో తేలిపోయింది. ముఖ్యంగా రెండో సెట్‌లో 5-21 భారీ వ్యత్యాసంతో వెనుకబడింది. కాగా, సింధు తప్పిదాలను వాంగ్ జీయీ చక్కగా ఉపయోగించుకుంది.

మొదటి గేమ్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన సింధు.. రెండో గేమ్‌లో ఆ దూకుడును చూపలేకపోయింది. ఇక మూడో గేమ్‌లో సింధు దూకుడు పెంచినా.. వాంగ్ జీయీ అద్భుత రీతిలో పుంజుకుంది. చక్కటి ప్లేస్‌మెంట్లు, షాట్లతో రెండు, మూడు గేమ్‌లను సొంతం చేసుకుంది. దీంతో మరో రెండు నెలల్లో ఆరంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌కు ముందు మలేసియా మాస్టర్స్ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకోవాలనుకున్న సింధుకు నిరాశే మిగిలింది.

Read More యూఎస్ పై గెలుపు.. సూపర్-8 కి భారత్

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా