Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్‌ షాక్.. బీసీసీఐ కీలక నిర్ణయం..!

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్‌ షాక్.. బీసీసీఐ కీలక నిర్ణయం..!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ ఆడకుండా హార్దిక్‌పై బీసీసీఐ నిషేధం విధించింది.

స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో తొలి మ్యాచ్ ఆడకుండా హార్దిక్‌పై నిషేధం, భారీ జరిమానాను విధించింది బీసీసీఐ. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేటు నమోదు చేసినందుకు గానూ బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ కూడా ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం నాలుగు మ్యాచ్ గెలిచింది. 10వ మ్యాచ్‌లో ఓడి పాయింట్ల పట్టికలో పదో స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై చివరగా ఐపీఎల్ 2020లో ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా నిరాశపరుస్తోంది. 

ఈ క్రమంలో పాండ్యా ఐపీఎల్‌లో తొలిమ్యాచ్ ఆడేందుకు నిషేధించడంతో పాటు రూ.30లక్షల భారీ జరిమానాను విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. ఐపీఎల్ 2024లో హార్దిక్ స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేయడం ఇది మూడోసారి. పాండ్యాతో పాటు ముంబై ఇండియన్స్ తుది జట్టులో ఆడిన ఆటగాళ్లకు రూ.12లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.

Related Posts

Advertisement

LatestNews