ఎల్బీనగర్ కాంగ్రెస్ కు షాక్ - సొంతగూటికి చేరుకున్న ఓరుగంటి -

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో కేటీఆర్ ను కలిసిన ఓరుగంటి

ఎల్బీనగర్ కాంగ్రెస్ కు షాక్ - సొంతగూటికి చేరుకున్న ఓరుగంటి -

  •   కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఓరుగంటి వెంకటేశం గౌడ్ బిఆర్ఎస్ లో చేరిక -  
  • బీసీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం - బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ 

విశ్వంభర, హైద్రాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బి ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఓరుగంటి వెంకటేశం గౌడ్ తిరిగి సోమవారం బి ఆర్ఎస్ పార్టీ సొంతగూటికి  చేరారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు అవకాశం లేదని పెట్టుబడి వర్గాలకు డబ్బున్నవాదులకు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో పదవులు వస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కనీసం బడుగు బలహీన వర్గాలకు మర్యాదలు ఉండవని సందర్భంగా ఆయన ఆరోపించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ లో పని చేయనున్నట్లు తెలిపారు బీసీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని ఆయన అన్నారు.

Tags: