రోజాకి రోజాభిషేకం.. వీడియో వైరల్..!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. వైసీపీ నాయకురాలు రోజాపై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు పార్టీ శ్రేణులు. ఓ కార్యక్రమానికి రోజా హాజరు కాగా ఎవరూ ఊహించని విధంగా సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఇప్పటి వరకు రాజకీయ నాయకులకు పెద్దపెద్ద గజమాలలతో సత్కరించడం చూశాం. లేదంటే లీటర్ల కొద్దీ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడమూ చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ట్రెండ్ మొదలైంది. వైసీపీ నాయకురాలు రోజాపై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు పార్టీ శ్రేణులు. ఓ కార్యక్రమానికి రోజా హాజరు కాగా ఎవరూ ఊహించని విధంగా సర్‌ప్రైజ్ ఇచ్చారు.
రోజాకు ఏకంగా రోజాభిషేకం చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. కొన్ని కిలోల రోజా పువ్వులను ఆమెపై గంపల్లో తీసుకొచ్చి ఆమెపై వెదజల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోజా కూడా ఆ రోజాభిషేకాన్ని ఎంజాయ్ చేశారు. అయ్య బాబోయ్ అంటూ ఆమె చిరునవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రోజాకి రోజాభిషేకం pic.twitter.com/lLgpvglA8K
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024