ప్రజా శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీ ధ్యేయం: దేప భాస్కర్ రెడ్డి.
విశ్వంభర, ఎల్బీనగర్
ప్రజా శ్రేయస్సు కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని టిపిసిసి సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత పాదయాత్రకు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనహిత పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్, మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కిచెన్న గారి లక్ష్మారెడ్డి సూచనల మేరకు జనహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టిన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మహేశ్వరం నియోజకవర్గం ఘన స్వాగతం పలికినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను పూర్తిగా తీసుకొని తెలంగాణలో ప్రజల చెంతకు మరింత చేరువైనందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జనహిత పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమం కి శ్రీకారం చెప్పినట్లు మహేష్ కుమార్ గౌడ్ కి సంఘీభావాన్ని ప్రకటిస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలు విజయవంతం చేస్తామని అన్నారు.



