లక్షలాది మంది విద్యార్థుల గొంతులను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది? : ప్రియాంక గాంధీ సూటి ప్రశ్న

లక్షలాది మంది విద్యార్థుల గొంతులను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది? : ప్రియాంక గాంధీ సూటి ప్రశ్న

విశ్వంభర, ఢిల్లీ : నీట్ మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని కొంతమంది విద్యార్థులు గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని, ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

మొదట, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది, ఇప్పుడు దాని ఫలితాల్లో కూడా స్కామ్ జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకే సెంటర్‌‌లో ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు గాను 720 మార్కులు తెచ్చుకున్నారు. ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు ఫలితాలు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read More మైక్రో ఫైనాన్స్ మోసాలపై సీఐడీ విచారణ చేయాలి

ఇది చాలా బాధాకరం, దిగ్భ్రాంతికరం. లక్షలాది మంది విద్యార్థుల గొంతులను ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది? నీట్ పరీక్ష ఫలితాల్లో రిగ్గింగ్‌కు సంబంధించిన చట్టబద్ధమైన ప్రశ్నలకు విద్యార్థులకు సమాధానాలు అవసరం. న్యాయబద్ధమైన ఈ ఫిర్యాదులపై విచారణ జరిపి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ఎక్స్‌లో అన్నారు.
అలాగే, నీట్ పరీక్షపై, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం స్పందించారు.

నీట్‌తో సహా అనేక పరీక్షలలో పేపర్ లీక్‌లు, రిగ్గింగ్, అవినీతి అంతర్భాగంగా మారాయి. దీనికి మోడీ ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాలి. అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, 2024 నీట్ పరీక్షను రద్దు చేయాలని దానిని తిరిగి నిర్వహించాలని కోరుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Related Posts

Advertisement

LatestNews

సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .
జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ