బెంగళూరుకు ప్రజ్వల్ రేవణ్ణ రాక…

బెంగళూరుకు ప్రజ్వల్ రేవణ్ణ రాక…

విశ్వంభర, బెంగళూరు : బీజేపీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ  ఈ నెల 31వ తేదీ తెల్లవారుజామున కర్ణాటక కు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. రేపు జర్మనీ నుంచి బెంగళూరు బయలుదేరనున్నారు. అయితే ఎయిర్ పోర్టులోనే ప్రజ్వల్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా కర్ణాటక నుంచి పోటీ చేసిన ప్రజ్వల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

 ఇక, ఎన్నికల నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని అభ్యంతరకర వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. అనంతరం బాధిత మహిళలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఆయనపై అత్యాచారం, కిడ్నాప్ కేసు నమోదైంది. అంతకుముందు..ఏప్రిల్ 27న ప్రజ్వల్ దేశం విడిచి జర్మనీకి వెళ్లిపోయారు.

Read More విప్లవ సింహం నల్లా నరసింహులు