వామ్మో.. ఇంటి వాటర్ ట్యాంకులో 30కిపైగా పాములు
సాధారణ ఒక్క పాము కనబడితేనే గుండె గుబేలుమంటుంది. అలాంటిది ఒక్కసారి 30కిపైగా పాములు కనబడితే ఎలా ఉంటుంది. భయంతో ఆమడదూరం పారిపోవడం ఖాయం. తాజాగా అస్సాంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
సాధారణ ఒక్క పాము కనబడితేనే గుండె గుబేలుమంటుంది. అలాంటిది ఒక్కసారి 30కిపైగా పాములు కనబడితే ఎలా ఉంటుంది. భయంతో ఆమడదూరం పారిపోవడం ఖాయం. తాజాగా అస్సాంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని వాటర్ ట్యాంకులో ఏకంగా 30కి పైగా పాములు కనిపించాయి. ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్‌రూమ్ వెళ్లాడు. అక్కడ వాటర్ ట్యాంకు పక్కకి రెండు, మూడు పాము తలలను చూశాడు.
వెంటనే భయంతో సమీపంలో ఉన్నవారిని పిలిచాడు. అనంతరం పాములు పట్టే సంజీబ్దేకా అనే వ్యక్తికి సమాచారం ఇచ్చారు. అతడు అక్కడికి వచ్చి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా వాటిలో గుంపులు గుంపులుగా పాములు ఉన్నాయి. దీంతో వాటన్నింటినీ అక్కడి నుంచి తీసివేశారు. కాగా, అన్ని బురద పాములు కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://www.instagram.com/reel/C7eW5ksy4YI/?utm_source=ig_embed&ig_rid=d1c60041-4055-4240-8ad4-80c90b612ff5