రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

నైరుతి రుతుపవనాలు ఇవాళ మాల్దీవులులో కొంత వరకు, కోమరిన్ ప్రాంతంలో కొంతమేర, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని అధికారులు తెలిపారు. దక్షిణ ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగిన ఆవర్తనం ఈరోజు బలహీన పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Read More పీసీసీ అధ్యక్షుడుని అయిన కార్యకర్తగానే ఉంటా

మరోవైపు రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకుతాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పారు. రుతుపవనాల సీజన్‌లో భారత్‌లో సాధారణం కంటే ఈసారి అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది.