సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుక్క పిల్ల చేష్టలు 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుక్క పిల్ల చేష్టలు 

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో చాలా మంది ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం లేదు. ఎక్కువ మంది తన రెగ్యూలర్ వర్క్‌తోనే రోజులో సగానికి పైగా సమయాన్ని కేటాయిస్తున్నారు. 

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో చాలా మంది ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం లేదు. ఎక్కువ మంది తన రెగ్యూలర్ వర్క్‌తోనే రోజులో సగానికి పైగా సమయాన్ని కేటాయిస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక పోలీసుల సంగతి అయితే వేరే చెప్పాల్సిన పని ఉండదు. రాత్రి పగలు అనే తేడా ఉండదు. స్టేషన్ నుంచి కాల్ వస్తే పరిగెత్తాల్సిందే. ఇక.. ట్రాఫిక్ పోలీసు పరిస్థితి మరీ దారుణం. ఎండ, వాన అనే తేడా లేకుండా ఆరు బయట పని చేయాల్సిందే. 

 

Read More మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న టైంలో ఒక్కోసారి పిచ్చి లేస్తూ ఉంటుంది. ట్రాఫిక్ క్రాస్ చేసే వాడు ఒకడు. సిగ్నల్ పడకుండానే వెళ్లిపోయేవాడు మరొకడు. వందల మందిని ఒక మాటతో కంట్రోల్ చేయాలంటే అంత ఈజీకాదు. రాత్రి సమయంలో అలాంటి పని అంటే ఇంకా చికాకుగా ఉంటుంది. కానీ.. అలా పని ఒత్తిడి ఉన్న సమయంలో మనం జంతువులు చేసే చేష్టలు మనకు కొంచె రిలాక్స్‌ని ఇస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 

 

Read More మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

ఓ ట్రాఫిక్ పోలీస్ రాత్రి డ్యూటీ చేస్తున్నారు. వచ్చిన వాహనాలను వైపుల కంట్రోల్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఉండే ఓ కుక్క చేసిన చేష్టలు చూసే వాళ్లందరకి నవ్వు తెప్పించే లా ఉంది. పోలీస్ ఎటు వైపు వెళ్తే ఆ కుక్కు కూడా అటే వెళ్తుంది. పోలీస్ చుట్టూ గెంతులు వేస్తూ పరుగులు తీస్తోంది. ట్రాఫిక్ ను పోలీస్ కంట్రోల్ చేస్తే.. పోలీస్ ను ఆ కుక్క కంట్రోల్ చేస్తున్నట్టు ఉంది. దీంతో.. పని ఒత్తిడిలో ఉన్న ఆ పోలీస్ కు కచ్చితంగా రిలీఫ్ అనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్ల పెంపుడు కుక్కలకు, మనుషులకు ఉన్న సంబంధంపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రాత్రి పూట పబ్లిక్ కోసం పని చేస్తున్న పోలీస్‌కు సలాం కొడుతున్నారు.

https://www.instagram.com/reel/C7MgxqgPL3k/?igsh=MzJvY240NnIzY3A2

Related Posts