బీహార్ కు ప్రత్యేక హోదా హామీని ప్రధాని ఎందుకు నెరవేర్చలేదు : జైరాం రమేశ్

బీహార్ కు ప్రత్యేక హోదా హామీని ప్రధాని ఎందుకు నెరవేర్చలేదు :  జైరాం రమేశ్

విశ్వంభర, ఢిల్లీ : ప్రధాని మోడీ బీహార్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. గతంలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇస్తానన్న హామీని ప్రధాని ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. పాట్నా విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్శిటీ హోదా ఎందుకు నిరాకరించారని నిలదీసింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘2014 ఎన్నికల ప్రచార సమయంలొ బీహార్‌కు ప్రత్యేక కేటగిరీ హోదాను ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదు’ అని విమర్శించారు.

‘బీహార్ భారతదేశంలోనే అత్యంత పేద రాష్ట్రం. రాష్ట్ర జనాభాకు అవసరమైన ఆరోగ్యం, విద్య జీవన ప్రమాణాలు అందుబాటులో లేవు. కానీ ఈ సమస్యలన్నింటిపై మోడీ దృష్టి సారంచడం లేదు’ అని పేర్కొన్నారు. కేంద్రంలో పదేళ్లు, బిహార్‌లో దాదాపు 20 ఏళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైందని తెలిపారు. ఇది బీహార్ ప్రజలు దీర్ఘకాల డిమాండ్ అని..కాబట్టి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2017లో పాట్నా యూనివర్సిటీకి సెంట్రల్ హోదా ఇవ్వాలని నితీశ్ కుమార్ చేసిన అభ్యర్థనను కూడా మోడీ పట్టించుకోలేదని తెలిపారు. దీనికోసం వేలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

Related Posts