అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం ఘన విజయం 

అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం ఘన విజయం 

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు ఖాయమైంది. ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా మొదటి నుంచే బీజేపీ హవా కొనసాగింది. అటు సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్కేఎం విజయ తీరాలకు చేరుకుంది.

2024 లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తిరుగులేని విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ గెలుపు ఖాయమని తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇవాళ(ఆదివారం) అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు ఖాయమైంది. ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా మొదటి నుంచే బీజేపీ హవా కొనసాగింది. 

అటు సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్కేఎం విజయ తీరాలకు చేరుకుంది. అరుణాచల్‌ అసెంబ్లీకి 60 స్థానాలు ఉండగా ఇప్పటికే మేజిక్ ఫిగర్ 31సీట్లను గెలుచుకుంది. మరో 14 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. దీంతో కమలం పార్టీ మరోసారి ప్రభుత్వ ఏర్పాటును ఖరారు చేసుకుంది. ఎన్‌పీపీ రెండు, పీపీఏ, ఇండిపెండెంట్‌లు చెరో స్థానంలో విజయం సాధించారు.  2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 సీట్లు దక్కించుకుంది. జేడీయూకి ఏడు సీట్లు, ఎన్పీపీకి ఐదు సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ నాలుగు చోట్ల గెలిచింది.

Read More డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ

2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎస్కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా) భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 32 అసెంబ్లీ సీట్లకు ఆదివారం ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా మొదటి నుంచి ఎస్కేఎం దూకుడును ప్రదర్శించింది. మెజారిటీ 17గా ఉండగా.. పీవాల్యూ ప్రకారం.. ఎస్కేఎం ఇప్పటికే 13 చోట్ల గెలిచింది. సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఒక్క స్థానానికే పరిమితమైంది. బీజేపీ, కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు. ఎస్‌కేఎం అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ మరోసారి సీఎం పదవి చేపట్టడం ఖాయమైంది.

Related Posts