Great: రెండు కాళ్లు, చెయ్యి లేకపోయినా ఎవరెస్ట్ ఎక్కాడు..!
ఆ యువకుడిని విధి వంచించింది. బాల్యంలోనే ఓ ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చేయిని కోల్పోయాడు. అయినప్పటికీ అతడు చింతించలేదు. తన ఆశయానికి అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించాలని అనుకున్నాడు.
ఆ యువకుడిని విధి వంచించింది. బాల్యంలోనే ఓ ప్రమాదంలో రెండు కాళ్లు, ఒక చేయిని కోల్పోయాడు. అయినప్పటికీ అతడు చింతించలేదు. తన ఆశయానికి అంగవైకల్యం అడ్డుకాదని నిరూపించాలని అనుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను అధిగమించాడు. చివరకు రికార్డు సృష్టించాడు. అతడే 30ఏళ్ల టింకేశ్ కౌశిక్.
గోవాకు చెందిన టింకేశ్ కౌశిక్‌కు తొమ్మిదేళ్ల వయసులో విద్యుదాఘాతానికి గురై కాళ్లు, చెయ్యి కోల్పోయాడు. కానీ పట్టుదలను కోల్పోలేదు. కృత్రిమ అవయవాలతో ఎవరెస్టును అధిరోహించి ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ యాంప్యుటీ వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. మే 4వ తేదీన నేపాల్ నుంచి ఈ సాహసయాత్రను ప్రారంభించిన టింకేశ్ మే11న బేస్ క్యాంపుపై జాతీయ జెండాను ఎగురవేశాడు.
ఈ సందర్భంగా టింకేశ్ మాట్లాడుతూ.. తన ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపాడు. ప్రతికూల వాతావరణంలో ధైర్యంతో ముందుకెళ్లానని చెప్పాడు. వారం రోజుల పాటు తన యాత్రం కొనసాగిందని తెలిపాడు. టింకేశ్ కౌశిక్‌ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. రాష్ట్రం గర్వించదగ్గ విషయమని, యువతకెంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
రెండు కాళ్లు, చెయ్యి లేకపోయినా ఎవరెస్ట్ ఎక్కాడు!
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024
గోవాకు చెందిన టింకేశ్ కౌశిక్(30) అనే యువకుడు 9 ఏళ్ల వయసులో కరెంట్ షాక్ వల్ల రెండు కాళ్లు, చెయ్యి కోల్పోయాడు కానీ పట్టుదలను కోల్పోలేదు.
కృత్రిమ అవయవాలతో ఎవరెస్టును అధిరోహించి ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ యాంప్యుటీ వ్యక్తిగా రికార్డు… pic.twitter.com/jRRTtAB5WD