మేడిగడ్డను సందర్శించిన నిపుణుల కమిటీ

మేడిగడ్డను సందర్శించిన నిపుణుల కమిటీ

మేడిగడ్డ బ్యారేజ్‌ను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం సందర్శించింది. పూణే నుండి జీఓ ఫిజికల్ ఇన్విస్టిగేషన్ అధికారి ధనుంజయ నాయుడు, జియో టెక్నికల్ ఇన్విస్టిగేషన్ అధికారి జె.ఎస్.ఎడ్ల బడ్కర్, జియో నాన్ డిస్ట్రాక్టివ్ టెస్ట్ అధికారి ప్రకాష్ తాలేలు.. మొత్తం ముగ్గురు నిపుణులతో కూడిన టీం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పరిశీలించింది. తొలుత మేడిగడ్డ దగ్గర జరుగుతున్న బ్యారేజీ పనులను పరిశీలించారు. తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూడా పరిశీలించారు. రేపు జలసౌధలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇరిగేషన్ సెక్రటరీలతో నిపుణుల కమిటీ సమావేశం కానుంది. 

 

Read More  చిక్కడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ 

మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక రిపేర్లు పనులు జరుగుతున్నాయి. పనులు మరింత వేగవంతం చేయడానికి నిపుణుల కమిటీ రంగంలోకి దింగింది. దెబ్బతిన్న, కుంగిన ఏడో బ్లాక్‌లో మొత్తంగా 11 గేట్లు ఉండగా, ఇందులో ఎనిమిది గేట్లు మూసి ఉన్నాయి. ఆనకట్ట పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఆ బ్లాక్‌లోని 15వ గేట్‌ను శుక్రవారం ఎత్తగా, మిగిలిన ఏడు గేట్లను ఎత్తడానికి పనులు చేస్తున్నారు. వరద ప్రవాహానికి కొట్టుకపోయి, చెల్లాచెదురుగా ఉన్న సీసీ బ్లాక్ అమరిక, స్యాండ్ గ్రౌటింగ్ పనులు సాగుతున్నాయి. వర్షాకాలంలో వరదను తట్టుకునేలా ఏడో బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్‌ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 

Read More  చిక్కడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ 

 

Read More  చిక్కడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ 

16వ గేట్‌ను కూడా ఎత్తితే ఏర్పడే ఇబ్బంది, సాధ్యాసాధ్యాలను నిపుణుల కమిటీ పరిశీలించింది. రేపు దీన్ని ఎత్తే అవకాశం ఉంది. ఈ గేటును ఎత్తితే మరమ్మతులు మరింత వేగవంతం అవుతాయి. రేపు జలసౌధలో ఏర్పాటు కానున్న మీటింగ్ తర్వాత గేట్లు ఎత్తివేతపై ఓ క్లారిటీ వస్తుంది.

Tags: