సంచలనం.. మొదటిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక

సంచలనం.. మొదటిసారి లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక



18వ లోక్ సభ స్పీకర్ పదవిలో కీలక ట్విస్ట్ నెలకొంది. దేశచరిత్రలోనే మొదటిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. ఓంబిర్లాకు స్పీకర్ పదవి కోసం అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య సమన్వయం కుదరట్లేదు. ఈ సారి ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశించింది. కానీ దానికి ఎన్డీయే కూటమి నుంచి సమాధానం రాలేదు. 

Read More తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం:వెంకయ్య నాయుడు

దాంతో స్పీకర్ పదవికి పోటీ నెలకొంది. ఇండియా కూటమి సైతం స్పీకర్ పదవి కోసం బరిలోకి దిగింది. కేరళ కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి తరఫున నామినేషన్ వేశారు. అటు ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా బరిలోకి దిగారు. ఈ ఇద్దరు నేతలు స్పీకర్ పదవి కోసం మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. 

దీంతో పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతోంది. అటు ఎన్డీయే కూటమి పోటీ లేకుండా ఏకపక్షంగా ఓంబిర్లాకు పదవి ఇచ్చేందుకు చాలానే ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దాంతో పోటీ తప్పట్లేదు. లోక్ సభలో ఎన్డీయే కూటమికే సంఖ్యాబలం అధికంగా ఉంది కాబట్టి.. ఓంబిర్లా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.