మారిన తెలంగాణ ఆర్టీసీ పేరు.. కొత్త పేరు..?

మారిన తెలంగాణ ఆర్టీసీ పేరు.. కొత్త పేరు..?

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఉత్తర్వులను కేంద్రం కూడా ఇటీవలే ఆమోదించింది. దీంతో.. వాహనాల రిజిస్ట్రేషన్లు కూడా TG పేరుతోనే జరుగుతన్నాయి. ఇప్పుడు TSRTC పేరును TGSRTC గా మార్చబడింది.

 

Read More గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో విప్రో కొత్త సెంటర్..

ఒకపై తెలంగాణ అంటే టీఎస్ అని కాకుండా టీజీ అని అన్ని ప్రభుత్వ శాఖల్లో వినియోగించాలని సీఎస్ శాంతికమారి ఇటీవల ఆదేశించారు. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు, ఇంకా ఇతర స్వతంత్ర సంస్థలు, కమిషన్‌ లు రాష్ట్రాన్ని TG గా గుర్తించాలని తెలిపారు. పాలసీ డాక్యుమెంట్లు, నోటీసులు, సర్క్యులర్లు, లెటర్‌హెడ్లు అలాగే అధికారిక పత్రాలపై TG కనిపించాలని అన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడే ఆర్టీసీ సంస్థ పేరును కూడా మార్చేశారు. 

 

Read More గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో విప్రో కొత్త సెంటర్..

TSRTC పేరు TGSRTC గా మార్చబడిందని సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పేరు మార్పు జరిగిందని తెలిపారు. దీంతో.. తెలంగాణ ఆర్టీసీ ట్విట్టర్ అధికారిక ఖాతా కూడా TGSRTCకి మార్చబడింది. ప్రయాణీకులు తమ విలువైన సూచనలు, సలహాలు, ఫిర్యాదులను కొత్తగా మార్చిన ఈ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేయాలని ఎండీ సజ్జనార్ కోరారు. TGSRTC అందించే సేవల గురించి తెలుసుకోవడానికి ఈ ఖాతాను ఫాలో అవ్వాలని చెప్పారు.

Tags: