అబ్కీ బార్ చార్ సౌ పార్ అనేది పూర్తిగా ఒక కళ : ఎంపీ శశిథరూర్
విశ్వంభర, వెబ్ డెస్క్ : బీజేపీ అబ్కీ బార్ 400 పార్ అనేది ఒక కళ అని, ఈ సారి ఓటింగ్ మంచి సంఖ్యలో జరగడంతో తమ విశ్వాసం మరింత పెరిగిందని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. ఎన్నికల గురించి మీడియాతో మాట్లాడిన ఆయన ఫలితాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో తిరిగానని, బీజేపీ చెబుతున్న అబ్కీ బార్ చార్ సౌ పార్ అనేది పూర్తిగా ఒక కళ అని స్పష్టంగా అర్ధం అవుతుందని అన్నారు.
గతంలో 2019 లో పుల్వామాలో జరిగిన విషాదానికి బాలాకోట్ లో జరిపిన ప్రతిస్పందనకు ధన్యవాదాలు చెబుతూ.. ఈ ఘటన మోడీ మొదటి టర్మ్ యొక్క ఆర్ధిక వైఫల్యాలపై రెఫరెండంగా ఉండాల్సిన ఎన్నికలను జాతీయ భద్రతా ఎన్నికలుగా మార్చిందని అన్నారు. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని తెలిపారు.
ఆ 11 రాష్ట్రాల్లో మళ్లీ ఆ తరహా ఫలితాలను పునరావృతం చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో కనిష్ట ఓటింగ్ నమోదు అయ్యిందని, గత ఓటింగ్ గణాంకాలతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్, ఇండియా కూటమి అభ్యర్ధులు బలంగా ఉన్న చోట ఓటింగ్ ఉత్సాహాన్ని కనబర్చిందని, ఓటింగ్ మంచి సంఖ్యలో జరిగడంతో మా విశ్వాసం మరింత పెరిగిందని శశిథరూర్ వెల్లడించారు.